శేషేంద్ర : సాహిత్య చరిత్ర లో
ఒక భయానక విషాద గాథ
--------
శేషేంద్ర శర్మ కాపీరైట్స్ /
ముఖాముఖి / ప్రశ్నలు జవ్వాబులు
1. గుంటూరు శేషేంద్రశర్మ వారసులుగా మీ అనుభూతి?
జ. నాకు ఆయన నాన్న , కన్న తండ్రి. అదే వారసత్వం , కానీ సాహిత్యం గురించి
మాట్లాడుకునేప్పుడు వారసత్వం , అర్థం , లక్ష్యం , పరమార్థం దీనికి పూర్తిగా భిన్నమైనది . సాహిత్యం ద్వారా ఆయన మీద ఆదరాభిమానాలు ఉన్నవారు, ఆయనకు తగిన గుర్తిపు గౌరవ పురస్కారాలు దక్కలేదని మనస్తాపం చెందేవారు , ఆయన పాఠకులూ అందరూ ఆయన వారసులే , ఆయన సాహిత్య ఆదర్శాలను ముందుకాలాలకు చేర్చేవారు ఎవరో ? వాళ్ళని ఆయన వారసులుగా కాలం గుర్తిస్తుంది .
2. శేషేంద్ర గారికి ఎంతమంది సంతానం? వారెక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
4 పిల్లలం , వారివారి జీవితాల్లో నిమగ్నులైవున్నారు
3. మీది గతంలో కాశ్మీరీ పండితుల వంశమని విన్నాను. నిజమేనా?
నాన్న కన్ను మూసిన క్షణం నుంచి ఆయన నేపథ్యాన్ని రూపుమాపే నేరపూరిత కుట్ర ఇది . ఒక రజాకార్ పుంశ్చలిక , ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు , ఒక పథకం ప్రకారం ఈ నేరానికి , ఈనాటికీ పాల్పడుతున్నారు . నూటికి నూరు పాళ్ళు తెలుగు కుటుంబం , ఆంద్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా , తోటపల్లిగూడూరు స్వగ్రామం , ఆయన తల్లిదండ్రుల నివాసం . మీకూ తెలుసు గదా .
4. నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరుతో మీ అనుబంధం?
జ. మాటల్లో చెప్పనలవి కానిది . తోటపల్లి గూడూరు అనగానే నాన్న , తాత అవ్వ అందరూక ళ్ళ ముందు ప్రత్యక్ష మవుతారు . వాళ్ళతో పెనవేసుకోవున్న స్మృతులన్నీ ఆల్బమ్ గా , మనసులో పుటలు పుటలుగా విఛ్చుకుంటాయి .
5. నాన్న గారు గ్యాన్‌బాగ్ ప్యాలస్‌కు ఎప్పుడు మారారు? ఆ సంఘటనపై మీరేం చెప్పదల్చుకున్నారు?
జ. . ఆయన జీవితంలో అత్యంత భయానకమయిన ప్రమాదం ఇది . ఇక అక్కడ అడుగు పెట్టినప్పట్నుంచి చివరి క్షణం వరకూ మానసికంగా , భౌతికంగా నరక యాతనకు గురయ్యాడు . అక్కడ ఉండలేక , ఆ నరక కూపం నుంచి , ఊబిలోంచి బయట పడలేక చెప్పనలవిగాని చిత్రవధకు గురయ్యాడు . వారానికొక సారి ఆ మనిషిని చావగొట్టి పారిపోయివచ్చ్చేవాడు . ఇక తన వద్దకు రావద్దని ఫోన్ లో అరిచేవాడు . ఆ మనిషి మినిస్టర్లతో , పెద్దవాళ్ళతో నాన్న మీద ఒత్తిడి తెచ్చ్చేది . మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు . 1997 వరకూ ఇదే గొడవ . ఆ మనిషితో ఉన్నదీ లేదు , తెగతెంపులు అయ్యిందీ లేదు . చెప్పనలవిగాని మానసిక , శారీరక క్షోభ . తెలుగు కవుల జీవితాల్లో ఇది ఒక నేర గాథ తప్ప మరొకటి కాదు . ఆయన కవిత చదవండి .
6. హైదరాబాదుకు మారాకే శేషేంద్ర గారికి విశ్వవిఖ్యాత గుర్తింపు వచ్చింది అనడం వాస్తవం కాదా?
జ. ఇది వాస్తవం కాదు . కవిగా , పండితుడిగా 1967 నాటికే సాహిత్య వర్గాల్లో గౌరవనీయుడయిన ప్రముఖుడిగా స్థిరపడ్డాడు . ఇక సమాజం లో గానీ జన బాహుళ్యంలో గానీ కీర్తి కోసం ప్రచారం కోసం ఆయన తాపత్రయ పడలేదు , ప్రయత్నించలేదు .
7. శేషేంద్ర రచనా వారసత్వం ఎవరు పుచ్చుకున్నారు?
జ. ఆయన మీద అపారమైన ఆదరాభిమానాలతో , ఆయన నెలకొల్పిన శైలి లో కవిత్వం రాసేవాళ్ళందరూ ఆయన వారసులు అని చెప్పుకోవాలి . ఆయన మీద ఆదరాభిమానాలున్న వారందరూ ఆయన వారసులే .
8. వారి రచనలపై పూర్తి కాపీరైట్ అధికారం మీకు ఉందని విన్నాను. ఆ వివరాలు చెప్పండి?
జ . 1989 డిసెంబరు 2 న , తన సమస్త రచనల పై , వాటి అనువాదాలతో సహా , గ్రంథ హక్కులు నాకు పుట్టిన రోజు కానుక గా నాన్న రాసిచ్చ్చాడు . ఈ విషయం లో ఆయన మీద నేను ఎలాటి ఒత్తిడి చేయలేదు . ఆ రోజు ఈ విషయం ప్రస్తావించిన తక్షణమే , ఎంతో సంతోషంగా , ఉత్సాహంగా తన లెటర్ హెడ్ మీద స్వదస్తూరీలో రాసిచ్చ్చాడు .
2001లో తనంతట తానే ఒక చం దోబద్ధ పద్యం రాసాడు . నా మీద ఆయన ప్రేమానురాగాల్లో ఎలాంటి మార్పు కడవరకూ లేదన్నది సుస్పష్టం . నాన్న జీవితంలో చివరి దశకం లో ( 1997 -2007) కొన్ని నగ్న సత్యాలకు నేను ఏకైక సాక్షిని . ఆయన రచనలు ఒక వ్యక్తి స్వీయ ప్రచారం కోసం , దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించాను . పైగా ఆయన పుస్తకాలు , ఆయన రచనలు పేరుతో నకిలీ రచనలు వెలుగులోగి రావడం జరిగింది . ఇ . ధ , వారి ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు ఈ అకృత్యానికి , హేయమైన నేరానికి పాల్పడడడం మొదలైనది . దీన్ని మొగ్గలోనే తుంచేయాలని సంకల్పించాను . ఆ మనిషి , తన కి , జా . ల తో కామోత్సవ్ నవల తిరగరాయించి నాన్న పేరుతో అచ్ఛువేయించింది . సమకాలీన సాహిత్యం లో ఇంతటి ఘోరం నేటివరకూ జరగలేదు . నాన్న ఉన్నప్పుడే ఈ నేరం జరిగింది . ఇక ఆయన కన్ను మూసినా తర్వాత ఇ . ధ , తన నేరపూరిత సొంత ప్రచారం కోసం నాన్న రచనల్ని వాడుకోవడం ప్రారంభించింది . తెలుగు విశ్వవిద్యాలయం వారికి 6 లక్షలు ఇచ్చ్చి పుస్తకాలు ప్రింట్ చేయించాలని ప్రయత్నించింది . వారికీ లీగల్ నోటీసు ఇఛ్చాను . వాళ్ళు ఆ అకృత్యాన్ని విరమించుకున్నారు . ఇ . ధ నిరంతరాయంగా ఈ నేరానికి పాల్పడడం సహజమే . నీల్ కమల్ పబ్లికేషన్స్ వారితో నాదేశం నాప్రజలు ప్రింట్ చేయించింది . దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో 2008 లో వేసిన కేసు లో 2018లో తీర్పు వచ్చింది . నాన్న నాకు రాసిచ్చిన కాపీరైట్స్ రద్దు చేసి , తనకు 2006లో తనకు బదిలీ చేసినట్లు ఇ . ధ ఒక నకిలీ పత్రం కోర్టుకు సమర్పించింది . కోర్టువారు ఈ పత్రాన్ని తెలంగాణ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపించింది . వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి , ఇ . ధ కోర్టుకు సమర్పించిన పత్రం నకిలీ ద ని , ఫోర్జరీ చేసిందని తేల్చిచెప్పింది . ఈ నివేదిక ఆధారంగానే తీర్పు చెబుతూ న్యాయమూర్తి , నాన్న రచనలు పై సర్వ హక్కులూ ఆయన కుమారుడినైన నాకు చెందుతాయని తేల్చిచెప్పారు . అసలు , ఈ తీర్పు లో ప్రధానాంశం ఏమిటంటే , నాన్న చనిపోయిన కొద్దీ రోజుల్లోనే నేను రాసిన " శేషేంద్ర శర్మ వారసులెవరు ? " వ్యాసం లో వెల్లడించిన యదార్థాలను ఈ తీర్పు ధృవీకరించింది . ఇ . ధ , ఆపాదమస్తకం నేరచరుతురాలని ఆ వ్యాసంలో నేను సాక్ష్యాధారాలతో పేర్కొన్నాను . తెలంగాణ హై కోర్టులో అప్పీలు వేసింది . జనవరి 25 , 2024 న్యాయస్థానం , ఈ అప్పీలును కొట్టేసింది . దిగువ కోర్టు తీర్పును ధృవీకరిస్తూ , ఇ . ధ , శేషేంద్ర శర్మ భార్య కాదని తేల్చిచెప్పింది . ఫలితంగా , ఇ . ధ , ఈ రోజు , నాన్న చనిపోయిన 17 సంవత్సరాల తరువాత , కొత్తగా ఆయన భార్య అని నిస్సిగ్గుగా ప్రచారం చేయిన్చుకుంటోంది . ఇ . ధ బిస్కెట్లతో పోషించే కి.జా. లు ఒకానొక పత్రికలో ఆపె పేరుతో మురికి రాతలు రాస్తున్నాయి. ఇ .ధ , ను నాన్న భార్యగా నిలబెట్టే ప్రచారం చేస్తున్నాయి . మహానుభావుడు , నార్ల వారు పత్రికా రంగంలో ఉన్నత ప్రమానాలు నెలకొల్పిన పత్రిక అది , ఈరోజు కి.జా.లకు , ఆ. జా. లకు స్థావరంగా మారింది . నకిలీ మురికి దొంగ రాతలకు నిలయంగా మారింది .
9. ఇటీవల నాన్న గారి వర్ధంతి సందర్భంగా మేము తోటపల్లి గూడూరులోని గృహం దర్శించి, అక్కడ వారి విగ్రహం ప్రతిష్టించాలని ప్రతిపాదించాం. ఈ విషయంపై మీ అభిప్రాయం?
జ. ఎంతో సంతోషకరమైన విషయం ఇది . నేను ఉబ్బితబ్బిబైపోయాను . నాన్న భౌతికంగా మన మధ్య లేక పోయినా , నిజంగా ఆత్మ అనేది ఉంటే నాన్న ఎంతో సంతోషిస్తాడు .
ఈ నేరపూరిత సమాజంలోనే , ముఖ్యంగా సాహిత్యం , పత్రికా రంగం లో కుళ్ళు హద్దు మీరిన పాడు కాలంలో , ఆయన జన్మస్థలాన్ని , ఆయన తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉండడం నేటి సమాజానికి ఒక చెంపదెబ్బ . గట్టి చెప్పుదెబ్బ . మీకు నా తరఫున , ఆయన అభిమానుల తరఫున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను .
10. శేషేంద్రగారిని గూర్చి మీరింకేమైనా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా?
జ. నాన్న తెలుగు సామాజిక చరిత్రలో ఒక భయానక విషాద గాథ . 1967- 70 వరకూ మహ రాజులా బతికాడు . అరిపిరాల విశ్వం , పోతుకూచి సాంబశివ రావు వీళ్లిద్దరి వెధవ పని వల్ల
జీవితాంతం చిత్రవధ అనుభవించాడు . సభ్య నాగరిక సమాజం కన్నుగప్పి ఎవరికీ తెలీకుండా కర్ణాటక లోని హళేబీడు లో వీధి నాటకం తంతు జరిగింది .
పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి మరోమనిషితో చేరాడన్న అవమానానికి , చెడ్డపేరు కు లోనయ్యాడు . తన స్వేఛ్చామయమైన సహజ జీవనానికి దూరమయ్యాడు .
వీటిని తట్టుకుని సాహిత్యం లో చేసిన కృషికి తగిన గౌరవమన్ననలు రాకపోగా , ఈర్ష్యాద్వేషాలకు గురయ్యాడు .
He is a jesus among jews .
- సాత్యకి S/o Seshendra Sharma
Srujana Telugu Epaper
22 Jun 2024 - Page 3
-------------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
జననం
1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం
2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి
సుబ్రహ్మణ్య శర్మ
తల్లి
అమ్మాయమ్మ
భార్య /
జానకి
పిల్లలు
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
0 comments