డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద ఆ పుస్తకం.. అందరి కళ్లు దానిపైనే! //
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద
ఆ పుస్తకం.. అందరి కళ్లు దానిపైనే! //
Pawan Kalyan With Seshendra Sharma Book:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు. పవన్ ముందుగా కార్యాలయంలో పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ బాధ్యతలు చేపట్టే ముందు తన వెంట తెచ్చుకున్న ఓ బుక్ను ముందు టేబుల్పై పెట్టారు.. ఆ తర్వాతే ఫైల్స్పై సంతకాలు చేశారు. దీంతో అందరి కళ్లు ఆ టేబుల్పై ఉన్న బుక్వైపు వెళ్లాయి.
ఆ బుక్ గురించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టి.. కొన్ని ఫైల్స్పై సంతకాలు చేశారు. అనంతరం పార్టీల నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేయగా.. వరుసగా సమీక్షలతో బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఆయన టేబుల్పై ఓ బుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బుక్కు పవన్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారా అని చూస్తే.. అప్పుడు అసలు విషయం తెలిసింది.పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి పుస్తకాలు చదవడం, రచనలు అంటే చాలా ఇష్టం.. సాహిత్యంపై ఆసక్తి ఉందని చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చదివారు. ఆయన ఎప్పుడో ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుంటారని చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్కు ఓ బుక్ అంటే మాత్రం చాలా ఇష్టమట.. ఆ పుస్తకాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా తన టేబుల్పై పెట్టుకున్నారు. ఆయనను ఇటీవల బాగా కదిలించిన గొప్ప పుస్తకం ఆధునిక మహాభారతం అని చెబుతుంటారు.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఈ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పవన్ కళ్యాణ్పై అంత తీవ్ర ప్రభావం చూపించింది. ఆ బుక్ చదివినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా తన వెంటే తీసుకెళుతున్నారు. ఇవాళ కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఆ బుక్ను తన పక్కనే టేబుల్పై ఉంచుకున్నారు. అంతేకాదు ఆ పుస్తకంలో కొన్ని పదాలను ఆయన రాశారు.. ఆ బుక్లోని 'ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత' అంటూ రాసిన వాఖ్యాలను గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మను ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.
మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు.. తనను ఎంతో ప్రభావితం చేశాయి అంటుంటారు పవన్ కళ్యాణ్. అంేతకాదు ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ రీ పబ్లిష్ చేయించడం విశేషం.పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు . శేషేంద్ర శర్మ గురించి ప్రస్తావనకు వచ్చింది. శేషేంద్ర శర్మ రచననలలో తను ప్రశ్నలకు సమాధానాలు కనిపించాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రజల కష్టాలు, ఇప్పటి జీవితాలు ఆయన రచనల్లో బాగా కనిపిస్తాయని.. దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఆయన పుస్తకాలను పరిచయం చేశారన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయని తనకు తెలిసిందన్నారు. వాళ్ల అబ్బాయి దగ్గర ఓ పాత బుక్ ఉందని తెలిస్తే.. మాట్లాడి ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించినట్లు చెప్పారు. అంతటి గొప్ప కవి శేషేంద్ర శర్మను కొత్త తరానికి పరిచయం చేసే అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి తరానికి తెలియాలనే.. తాను రీ ప్రింట్ చేయించానన్నారు పవన్ కళ్యాణ్.గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప తెలుగు కవి.. విమర్శకుడు, సాహితీవేత్త, వక్తగా ఉన్నారు. అలాగే ఆయన సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో జన్మించారు. ఆయన ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు లా కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు.. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శేషేంద్ర శర్మ వచన కవిత్వం, పద్యరచనలో ప్రతిభావంతులు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ప్రత్యేకతగా చెబుతారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు కూడా చేశారు. 'నా దేశం-నా ప్రజలు' 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ట్రేంద్రు’ బిరుదు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్నారు.https://telugu.samayam.com/తిరుమల బాబు | Samayam Telugu19 Jun 2024 ///పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
HOME » ANDHRA PRADESH » ANDHRA PRADESH DEPUTY CM PAWAN KALYAN IMPRESSED SESHENDRA SHARMA BOOK SDR
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:56 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు. వృత్తి, ప్రవృత్తిని సమానంగా ముందకు తీసుకెళుతున్నారు. అభిమానులనే కాదు జనంతో మమేకం అవుతారు. పవన్ కల్యాణ్లో ఓ విలక్షణ ఉంది. సాహిత్యంపై ఆసక్తి. ఆయనను కదిలించిన గొప్ప పుస్తకం ‘ఆధునిక మహాభారతం’.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఆ పుస్తకం రాశారు. కవిసేన మేనిఫెస్టే, కాలరేఖ వంటి సంచలన గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆధునిక మహాభారతం పుస్తకం పవన్ కల్యాణ్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లిన తన వెంట తీసుకెళుతున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. ఆ పుస్తకంలో కొన్ని పదాలను పవన్ కల్యాణ్ రాశారు. ఒక ‘దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని’ పవన్ కల్యాణ్ రాశారు.
------------
Aha UNSTOPABLE 2
WITH NBK : POWER FINALE 2
On 10th February 2023
నందమూరి బాలకృష్ణ : ఇపుడు బుక్స్ విషయానికి వస్తే ఆధునిక మహాభారత పుస్తకాన్ని ఎంతో ఖర్చుపెట్టి రీప్రింట్ చేయించావు
పవన్ కళ్యాణ్ : అవును
నందమూరి బాలకృష్ణ : గుంటూరు శేషేంద్ర శర్మ గారి మహా రచయిత ఇప్పుడు తిరిగి ఈతరం కుర్రాళ్లకు పరిచయం చేశావు . నీకు ఎందుకు అలా అనిపించింది ?
పవన్ కళ్యాణ్ : నాకు నాలో ఉండే ప్రశ్నలకి చాలా వాటికి సమాధానాలు ఆ పుస్తకంలోనే ఉన్నాయి, సమాజంలో సగటు మనిషి వేదనకు గాని, సమాజం దేనికిట్లా ఉంది, అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే సమస్యలను చూసి, వాటన్నిటికీ నాలో ఉన్న వేదనకి శేషేంద్రశర్మ గారి పుస్తకంలోని ఉన్నాయి, ఏదైనా సరే జ్ఞ్యానాన్ని పంచుకోవడం చాలా అవసరం మనకు మంచి విషయం తెలిసినప్పుడు పదిమందితో పంచుకోవాలనేది నా ఒక ఆలోచన ఉంటుంది నాకు. నేను చాలా స్ఫూర్తి పొందిన పుస్తకం కాబట్టి చదివే కొద్ది 1, 2, పుస్తకాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర దొరికింది . బుక్, ఇలా పట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోయింది ఫస్ట్ ప్రింట్ అప్పుడో అయ్యింది . తర్వాత ఇక ప్రింట్ కాలేదు . చాలా సార్లు (ఆ పుస్తకాన్ని )వెతికాను కానీ అవుట్ ఆఫ్ ప్రింట్ , అని చెప్పారు, ఇంత గొప్ప సాహిత్యపు విలువలతో ఉన్న పుస్తకము అది
భారతదేశం నుండి నోబెల్ బహుమతికి ఎన్నికైన పుస్తకంలో మొదటిగా నిలిచిన పుస్తకం, కనుక్కోండి ఎవరైనా వారి కుటుంబ సభ్యులు ఉన్నారా అని అడిగాను, అప్పుడు కవి శేషేంద్ర శర్మ గారి అబ్బాయి సాత్యకి గారు ఉన్నారు ఆయన దగ్గర మాట్లాడితే, నా దగ్గర ప్రింట్లు లేవు కానీ, ఎవరైనా నిలబడతానంటే దాన్ని రిప్రింట్ చేయిస్తాను అన్నారు,
పవన్ కళ్యాణ్ : వెంటనే అది నా ఒక్కడి కోసం ఎందుకు అందరి కోసం చేద్దామని చెప్పి చాలా బుక్స్ ప్రింట్ చేయించాను,
నందమూరి బాలకృష్ణ : నీ వల్ల (ఒక మంచి పుస్తకం) మరుగున పడిపోకుండా ఎంతోమంది మనుసులో వెలుగు నింపిన పుస్తకానికి నువ్వు వెలుగునిచ్చా వు .
పవన్ కళ్యాణ్ : భగవంతుడు ఆ అవకాశాo నాకు ఇచ్చాడు అలాంటి కవిని కొత్త తరానికి పరిచయం చేసే అరుదైన అవకాశం గా నేను భావిస్తాను.
----
అదో గొప్ప పుస్తకం
గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహాభారతం గొప్ప సాహిత్య విలువలతో ఉన్న పుస్తకం . నాలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందులో ఉన్నాయి . సగటు మనిషి వేదన , ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నలకు జవ్వాబులు కనిపించాయి . ఎక్కడా ఆ పుస్తకాలు దొరకలేదు . శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకితో మాట్లాడి పునర్ముద్రణ చేయించాం .
- పవన్ కళ్యాణ్
ఈనాడు దిన పత్రిక
10 - 02 2023
More information
Visible by: Everyone
All rights reserved
-
Taken on Friday July 12, 2024
-
Posted on Friday July 12, 2024
- 13 visits
0 comments